వారిరువురూ వారి వారి దేశకాల పరిస్థితుల పరిణామాలకు అనుగుణంగానే ప్రవర్తించారు. ఒకరికి, యుద్ధనీతిని పాటించడం ధర్మమైతే, మరొకరికి తన ప్రజల రక్షణ మరియు భద్రతే ధర్మం. పృథ్వీరాజ్ చౌహాన్ లేదా శ్రీ కృష్ణ దేవరాయల యొక్క సమకాలీనులు తమ తమ పాలకులైన వారిరువురి చర్యలను విమర్శించడం బహుశా అసాధ్యం. కేవలం పరిస్థితులకు అనుగుణంగానే వారిరువురూ నడుచుకున్నారు. అయితే, ఆ కాలం గడిచిన శతాబ్దాల తరువాత వెనుకకు ఒక్కసారి తిరిగి చూస్తే...