కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్మూ కాశ్మీర్ జిల్లా అభివృద్ధి సంస్థల (డిడిసి) ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ డిసెంబర్ 21న ప్రకటించింది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జరిగిన తొలి ఎన్నికలు ఇవే. ఈ ఎన్నికలు చాలా అంశాల్లో ప్రాధాన్యతను కలిగి ఉన్నాయి. గుప్కార్ అలయన్స్ పార్టీలు (నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్ సి), పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పిడిపి), ఐదు ఇతర స్థానిక పార్టీలు) తొలుత ఎన్నికలను బహిష్కరించాలని భావించినప్పటికీ ఆ తర్వాత ఎన్నికల్లో పాల్గొన్నాయి. అప్నా పార్టీ, అధికరణ 370 రద్దు తరువాత జరిగిన పరిణామాలనంతరం వచ్చిన పార్టీ. ఈ ఎన్నికల్లో వివిధ రంగాలకు చెందిన ప్రజలు పాల్గొన్నప్పటికీ, ఈ ప్రాంతం యొక్క సున్నితత్వాన్ని పరిగణనలోకి తీసుకొని 8 దశల్లో ఎన్నికలు జరిగాయి. మహమ్మారి ఉన్నప్పటికీ భారత ప్రభుత్వం ఎన్నికలను నిర్వహించడమనేది ఆహ్వానించదగ్గ పరిణామం. ఈ ఎన్నికల ఫలితాల్లోని కొన్ని ముఖ్య అంశాలు చర్చించు కోవాలి. 

ప్రజాస్వామ్య విజయం: 

ఆర్టికల్ 370 రద్దు తర్వాత భారత్, పశ్చిమ దేశాల ఉదారవాద మీడియా కశ్మీర్ భవిష్యత్తు, దాని ప్రజాస్వామ్యం గురించి తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తింది. భద్రతా బెదిరింపులను సమీక్షించి, ఎన్నికల నిర్వహణకు భారత ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన భారత ఎన్నికల సంఘం,  కేంద్ర పాలిట ప్రాంతమైన జమ్మూ కాశ్మీర్ లో డిడిసి ఎన్నికలు నిర్వహించింది. పొరుగున ఉన్న పాకిస్థాన్ నుంచి భద్రతా ముప్పును పరిగణనలోకి తీసుకుని 8 దశల్లో ఎన్నికలు నిర్వహించింది. ఈ ఎన్నికల ముఖ్యోద్దేశం ప్రజాస్వామ్య పరిరక్షణ. గత సంవత్సర కాలంగా అంతర్జాతీయ మీడియా లో భారత్ ఫై అమెరికా డెమోక్రాటిక్ పార్టీ మరియు బ్రిటన్ లోని లేబర్ పార్టీ కాశ్మీర్ లో మానవ హక్కులకు విఘాతం కలిగించేలా ఉన్నాయి అని తమ నిరసన తెలియజేశాయి. పాకిస్తాన్ తన కుయుక్తులతో ఈ రెండు దేశాలలోని, ఈ పార్టీలను భారీ లోబ్యింగ్ ద్వారా భారత్ ఫై ఉసిగొల్పింది. గత సంవత్సరం అమెరికా ప్రతినిధి సభ లోని డెమోక్రాటిక్ పార్టీ కి చెందిన  సోషలిస్ట్ మరియు భారత సంతతి కి చెందిన ప్రమీల జయపాల్ తన నియోజక వర్గం లోని కొంత మంది పాకిస్తానీ అమెరికన్ల భారత్ వ్యతిరేక ఫిర్యాదులను  పరిగణనకు తీసుకొని HR 485 హౌస్ రెసొల్యూషన్ తీర్మానం నోటీసు పంపింది. ఒక్క మాటలో చెప్పాలంటే, కాశ్మీర్ లో మానవ హక్కుల విఘాతం కలిగిందిందని, దీని ఖండించే తీర్మానం సభ లో ప్రవేశ పెట్టింది. అయితే , దీనికి కావాల్సిన మద్దతు దొరకనందున అది విఫలమైంది.  భారత్, ఈ పరిణామాలను దృష్టి లోకి  తీసుకొని ప్రపంచ దేశాలకు ఈ ఎన్నికల ద్వారా జవాబు చెప్పింది. ఈ ఎన్నికలు , అమెరికా లో బిడెన్ రాష్ట్రపతి పగ్గాలు చేప్పట్టే లోపు జరగడం ఒక ముఖ్య పరిణామం. దీని వలన భారత్ ముందు ముందు జరిగే పరిణామాలను సమర్థవంతగా ఎదుర్కొనేలా చెక్ పెట్టింది. 

కాశ్మీర్లో బీజేపీ పాగా

భారత్ లోని ప్రగతి శీల పార్టీలైనటువంటి కాంగ్రెస్, వామపక్షాలు మరియు కాశ్మీర్ పార్టీలు , బీజేపీ కి కాశ్మీర్ లో అంత సీన్ లేదని తక్కువ అంచనా వేసాయి అయితే , ఈ ఎన్నికల్లో బీజేపీ తన ప్రభంజనం చూపింది. బీజేపీ జమ్మూ లో తన ప్రభావాన్ని నిలుపుకుంటూనే కాశ్మీర్ లోయ లో తొలి సారి ఖాతా ను తెరవడం ఒక ప్రత్యేకం . బీజేపీ ప్రతి ఎన్నికను ఒక సవాలుగా తీసుకొనే క్రమం లో కాశ్మీర్ లో బాగా ప్రచారం చేసింది . దాని పరిణామం , కాశ్మీర్ లో ౩ స్థానాలు గెలుచుకోవడం. ఇందులో ప్రత్యేకమేమిటంటే, రాజధాని శ్రీనగర్ లోని ఒక స్థానాన్ని కైవసం చేసుకోవడం, అంతే కాదు పుల్వామా, బందిపోరా నియోజకవర్గాల్లోని ఒక్కో స్థానాన్ని గెలుచుకొంది. జమ్మూ కాశ్మీర్ చరిత్రలో భాజపా, ముస్లిం మెజారిటీ కాశ్మీర్ లోయలో కి రాడం ఇదే మొదటిసారి. నిజానికి జమ్మూ కాశ్మీర్ రాజధాని శ్రీనగర్ లో భాజపా విజయం చెప్పుకోదగ్గది. అన్ని స్థానిక పార్టీలు శ్రీనగర్ లో తమ ఉనికిని కలిగి ఉన్నాయి మరియు ఏడు దశాబ్దాలుగా మూడు రాజకీయ పార్టీలైన నేషనల్ కాన్ఫరెన్స్ , పీడీపీ , కాంగ్రెస్ పార్టీ తమ గుత్తాధిపత్యాన్ని చెలాయించింది . అయితే ఈసారి స్థానిక ఎన్నికల్లో బీజేపీ ఈ మూడు పార్టీలను పక్కకు నెట్టి తన ఓటు బ్యాంకు ను కైవసం చేసుకోవడం ఊహించని పరిణామం. ఇది ఒక చిన్న గెలుపు అయినప్పటికీ కాశ్మీర్ లోయ లో పాగా వేయడం అనేది ఒక నూతన పరిణామం. కాశ్మీర్ పార్టీలను, కాంగ్రెస్ పార్టీ ను పక్కకు నెట్టి వారి ఓటు షేర్ ను లాక్కోవడమనేది గమనార్హం. 

గుప్కర్ పార్టీల ఆధిపత్యం సన్నగిల్లిందా ?

గుప్కర్ పార్టీలు అయినటువంటి నేషనల్ కాన్ఫరెన్స్ , పీడీపీ , మరో ఐదు పార్టీలు ఫరూక్ అబ్దుల్లాహ్ నివాసంలో కలిసి జమ్మూ కాశ్మీర్ స్వతంత్ర ప్రతిపత్తి పునరుద్దరించే అంశం ఫై  డిక్లరేషన్ చేసాయి అందువలన ఆ ఏడు  రాజకీయ పార్టీలు PAGD (పీపుల్స్ అలయన్స్ ఆఫ్ గుప్కార్ డిక్లరేషన్) గా ఏర్పడ్డాయి. పిడిపి, మరియు గుప్కార్ కూటమిలోని ఐదు ఇతర పార్టీలు కాశ్మీర్ లోయలో ఆధిపత్యాన్ని కొనసాగించాయి, అయితే పిడిపి, కాశ్మీర్ లోయ లో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించనివ్వబోమని బెదిరించిన నేపథ్యంలో , ఆ పార్టీ, ఎన్నికలలో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. 27 సీట్లు సాధించినప్పటికీ, విద్వేషం, వంశరాజకీయాల కారణంగా దాని ఓటు షేరు బాగా క్షీణించింది. గుప్కార్ కూటమి 110 సీట్ల తో గెలిచి కశ్మీర్ లోయను స్వీప్ చేసింది అయితే గుప్కర్ పార్టీల ఉమ్మడి  ఓటు శాతం బీజేపీ కంటే తక్కువ రావటం గమనార్హం.  భాజపా కు ఓటు వాటా 38.74 శాతం రాగా, గుప్కార్ కూటమికి మొత్తం ఓటు 32.96 శాతం. భాజపాకు మొత్తం 4,87,364 ఓట్లు రాగా, ఎన్ సి, పిడిపి, కాంగ్రెస్ లు కలిపి మొత్తం ఓట్లు 4,77000 వచ్చాయి. కాగా, ఇది బిజెపి ఓటు కంటే చాలా తక్కువ, భాజపాకు మొత్తం 75 సీట్లు వచ్చాయి. ఆసక్తికరమైన విషయమేమంటే, ఇండిపెండెంట్లు పిడిపి, కాంగ్రెస్ పార్టీ కంటే దాదాపు 50 సీట్లు సాధించారు. మరో ఆసక్తి పరిణామం ఏంటంటే శ్రీనగర్ లో 14 స్థానాలకు గాను 8 స్థానాల్లో ఇండిపెండెంట్లు విజయం సాధించడం మరియు నేషనల్ కాన్ఫరెన్స్ , పీడీపీ, కాంగ్రెస్ పార్టీల ఓటు శాతం తగ్గడం తప్పకుండ ఒక నూతన పరిణామం అని చెప్పవచ్చు. ఇది గుప్కార్ అలయన్స్ యొక్క కుటుంబ పార్టీలను తిరస్కరించారని చెప్పవచ్చు.  వాస్తవానికి కేవలం 26 స్థానాల్లోనే కాంగ్రెస్ పార్టీ పరిమితమవ్వడం అనేది ఆ పార్టీ నైరాశ్యతను మరియు వైఫల్యాన్ని సూచిస్తోంది. ఇక్కడ ఒక ముఖ్యమైన పరిశీలన ఏమిటంటే 1995 అసెంబ్లీ సీట్ల డీలిమిటేషన్ ఆధారంగా ఎన్నికలు జరిగాయి. జమ్మూ కాశ్మీర్ జనాభాను పరిగణనలోకి తీసుకుని జమ్మూ&కె డీలిమిటేషన్ ఇంకా చేయాల్సి ఉంది. జమ్మూ ప్రాంతం తన జనాభాను పరిగణనలోకి తీసుకున్న తరువాత ఎక్కువ సీట్లు వస్తాయని భావిస్తున్నారు. 

DISCLAIMER: The author is solely responsible for the views expressed in this article. The author carries the responsibility for citing and/or licensing of images utilized within the text.