ఇలాగేనా ? ఇంతేనా బాలూ?
మాట తప్పడం మర్యాదేనా?
హాస్పటల్ కెళ్ళేటప్పుడు ఏం చెప్పావు?
నాకేం లేదు,నాకేం కాదు అన్నావా లేదా?

మాట తప్పేవు బాలూ మడమ తిప్పేశావు
తమ్సప్ గుర్తు ?చూపించావు
తప్పక త్వరలో తిరిగొస్తానన్నావు
నీవేమి చెప్పినా నమ్ముతాము మేము
అలా ఎప్పట్లాగే నమ్మేము మేము నిన్ను నీమాటను
కావాలంటే వినండి ఎంత కమ్మగా పాడుతున్నానో అన్నావు బెడ్ పైనుండి
విని మైమరచి పోయాము
నిజమే బాలూకేమీ లేదు కాదు అనుకొన్నాము
వెళ్ళినవాడు నాలిక్కరుచుకొని వెనుకకు వచ్చేస్తాడనుకున్నాము
ఎప్పటికప్పుడు మోసంచేస్తూనే వచ్చావు నీవు
తమ్సప్?ఝా సింబల్ చూపిస్తునే వచ్చావు!

అవునులే నువ్వు మాయగాడివే
కోట్ల జనుల హృదయాలు కొల్లగట్టిన వాడివి నువ్వు
మాటమీద నిలబడతావని అనుకోటం మాదే తప్పు
అయితే మరీ ఇంత దగా చేసి
కోట్లాది జనుల కళ్ళుగప్పి
మాయమయ్యేంత మాయగాడివని తెలియదు
పోతూ పోతూ ఎందరి హృదయాలు గాయంచేసేవు నీవు
ఎందరెందరిని కన్నీటి సాగరంలో ముంచావు!

సరే చేసిందేదో చేశాసేవ్ కానీ
వెళ్ళాలనుకొన్న చోటికి వెళ్ళి
చూడాలనుకొన్నవన్నీ చూసేసి
వినాలని ఉవ్విళ్ళూరుతున్న వాళ్ళకు
నీ గానసుధను పంచదగిన వాళ్ళైతే పంచేసి
వెనుకకు వేగంగా వచ్చేయ్ బాలూ
నీ రాకకు ఎదురు చూస్తూ వుంటాం
మాటకు విలువనిచ్చే నీవు
పాటలు పాడుకుంటూ వచ్చేయ్ వేంగంగా!

మాట నిలబెట్టుకోబాలూ !
మాట నిలబెట్టుకోబాలూ !!

రచన – కుంటముక్కల సత్యవాణి

DISCLAIMER: The author is solely responsible for the views expressed in this article. The author carries the responsibility for citing and/or licensing of images utilized within the text.