వందేమాతర గీతం
వరుస మారనీయకు
దాని ఘనత మాయనీయకు
వందేమాతరం వందే మాతరం ॥॥
బకించంద్ర చటోపాద్యాయ
భక్తి భావ లహరి యది
గుండెలలో ఉప్పొంగిన
దేశ భక్తి సారమది
వేల వేల గొంతులలో
నినదించిన గేయమది
వందేమాతరం వందేమాతరం ॥॥
తెల్లదొరల గుండెల్లో
దిగబడిన శూలమది
స్వాతంత్య్ర పోరాటంలో
శివమెత్తిన నాదమది
జాతిని ఏకం జేసిన
జన్మభూమి నినాదమది
స్వాతంత్ర్యం ఒనగూర్చిన
సమర శంఖు పూరణది
వందేమాతరం వందేమాతరం ॥॥
మారనీకు వరుసనీవు
మన జాతీయ గేయమది
ఉత్తేజిత మొసగునది
ఉత్తుంగ తరంగమది
దేశ సమగ్రత తెలిపే
దివ్యమైన నాదమది
వందేమాతరం వందేమాతరం
వందేమాతరం వందే వందే వందే…. ॥॥
DISCLAIMER: The author is solely responsible for the views expressed in this article. The author carries the responsibility for citing and/or licensing of images utilized within the text.